మగవాళ్లు గడ్డం పెంచుకోవడం వల్ల కలిగే లాభాలివే.. ఈ విషయాలు అస్సలు ఊహించలేరు!

మగవాళ్లలో చాలామంది గడ్డం పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయంలో కుటుంబ సభ్యుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా చాలామంది ఆ వ్యతిరేకతను పట్టించుకోరు. అయితే మగవాళ్లు గడ్డం పెంచుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా గడ్డం పెంచుకోవడం వల్ల అందంగా కనిపించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

గడ్డం పెంచడం వల్ల శరీరంపై హానికరమైన యూవీ కిరణాలు పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ విధంగా జరగడం వల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ సైతం తగ్గుతుంది. గడ్డం పెంచడం వల్ల చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉండటంతో పాటు ముఖంపై మొటిమలు, పగుళ్లు వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. గడ్డం పెంచడం వల్ల ముఖంపై ముడతలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

గడ్డం పెంచడం వల్ల వృద్ధాప్య ఛాయలు తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖంపై దుమ్ము, ధూళి పడకుండా చేయడంలో గడ్డం తోడ్పడుతుందని చెప్పవచ్చు. గడ్డం పెంచడం వల్ల గాలిలో ఉండే బ్యాక్టీరియా త్వరగా నోటిలోకి చేరే అవకాశం అయితే ఉండదు. గడ్డం పెంచడం వల్ల లాభాలే తప్ప ఎలాంటి నష్టాలు లేవని చెప్పవచ్చు. గడ్డం ఎక్కువగా పెంచేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

గడ్డం పెంచడం ద్వారా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. గడ్డం ఉంటే ముఖం మంచి మాయిశ్చరైజ్‌ను కలిగి ఉండడంతో పాటు యంగ్ అండ్ స్మార్ట్‌లుక్‌తో అందంగా కనిపించేలా చేస్తుంది. ఆస్తమా, గొంతు ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే బ్యాక్టీరియా, టాక్సిన్స్ లోపలికి వెళ్లకుండా గడ్డం నివారిస్తుందని చెప్పవచ్చు.