బిల్వ పత్రాలు దేవుడిని పూజిస్తే ఇన్ని లాభాలా.. అలాంటి ఫలితాలు కలుగుతాయా?

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో పూజ కోసం బిల్వ పత్రాలను ఉపయోగిస్తూ ఉంటారు. బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. కొంతమంది దేవుళ్లకు పూజ చేసే సమయంలో బిల్వపత్రాలు ఉంటే మంచిదని చెప్పవచ్చు. హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉండగా పూలు లేకుండా పూజ పూర్తి చేయడం అస్సలు సాధ్యం కాదు.

దేవుడికి ఇష్టమైన పువ్వులను సమర్పిస్తే శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. కొందరు దేవుళ్లకు కొన్ని రకాల సమర్పించడం వల్ల చెడు ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. శివుడికి బిల్వ పత్రాలతో పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయి. శివుడికి క్యాడీ పువ్వులను సమర్పిస్తే మాత్రం చెడు ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. శ్రీ మహా విష్ణువుకు ఏకాదశి తిథి రోజున ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.

అయితే విష్ణుమూర్తికి మాధవి, చంపా పువ్వులను, అగస్త్యపుష్పంను సమర్పించకూడదు. సూర్యదేవుడిని పూజించే సమయంలో మాత్రం బిల్వ పత్రాలను అస్సలు ఉపయోగించకూడదు. బిల్వ పత్రాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉండగా ఆయుర్వేదంలో ఈ పత్రాలను ఉపయోగించడం జరుగుతుంది. పిల్లల్లో విరేచనాలు, అల్సర్, కీళ్లనొప్పులు, శ్వాసకోశవ్యాధులు, పీరియడ్స్ సమస్యలకు చెక్ పెట్టడంలో బిల్వపత్రాలు ఉపయోగపడతాయి. బిల్వ పత్రాలతో పూజించడం ద్వారా దేవుడి అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. ప్రతి సోమవారం రోజున శివుడిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. బిల్వ పత్రాలను కొంతమంది దేవుళ్లకు మాత్రమే సమర్పించాలనే నియమ నిబంధనలను గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.