బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. బ్యాంకులో అధికారులు కావాలని కలలు కంటున్న యువతకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంకులో వివిధ విభాగాల్లో మొత్తం 143 పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా ఏప్రిల్ 10 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. bankofindia.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హత, వయోపరిమితిని కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఆన్‌లైన్ పరీక్ష,వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్ పరీక్షలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించిన ప్రశ్నలతో పాటు ఇతర ప్రశ్నలు ఉంటాయి. బ్యాంకింగ్ పరిశ్రమపై ప్రత్యేక సూచనతో సాధారణ అవగాహన ప్రశ్పలు ఉంటాయని తెలుస్తోంది.
జనరల్, ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా 850 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 175 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలుగుతుంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. యూపీఐ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఫీజు పేమెంట్స్ ను చెల్లించే అవకాశం అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుంది.