నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఇదే.. భారీ వేతనంతో బ్యాంక్ ఉద్యోగ ఖాళీలు!

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1172 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలలో ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్టు) ఉద్యోగాలు 1036 ఉండగా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు 136 ఉన్నాయని సమాచారం అందుతోంది. స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలలో 84 మేనేజర్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

మిగిలిన ఉద్యోగ ఖాళీలలో 46 అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు, 6 డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. స్పెషలిస్ట్ క్యాడర్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 1 నుంచి మొదలుకానుండగా జూన్ 15వ తేదీ చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్టు) ఉద్యోగాల విషయానికి వస్తే మొత్తం 1036 ఉద్యోగ ఖాళీలు ఉండగా గత నెల 24వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. జూన్ నెల 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు పనితీరు ఆధారంగా సర్వీసు పొడిగింపు ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వల్ల నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతుందని తెలుస్తోంది.