ఓటీటీ ప్లాట్ ఫామ్ అంటే తెలియని వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. కరోనా తర్వాత భారత్ లో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఆదరణ బాగా పెరిగింది. అందరూ థియేటర్లలో సినిమాలు చూడటం కన్నా కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమాలను చూస్తూ ఆనందించే వారి సంఖ్య అధికమవుతుంది. ఇలా కరోనా తర్వాత ఓటీటీలకు మంచి ఆదరణ వచ్చిందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఓటీటీల సబ్స్క్రిప్షన్ తీసుకునే వారి సంఖ్య కూడా అధికమవుతుంది. ఇలా ఇప్పటికే ఎన్నో ఓటీటీ సమస్థలలో అత్యంత ఆదరణ పొందినటువంటి వాటిలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా ఒకటి.
ఓటీటీ అటు సినిమాలు మాత్రమే కాకుండా షోస్, ఒరిజినల్ సిరీస్ లు, హాలీవుడ్ కంటెంట్ బాగా స్ట్రీమ్ చేస్తుంటుంది. డిస్నీ ప్లస్ పేరుతో యాక్షన్ సినిమాల కోసం కేటగిరీనే ఉంటుంది. దానిలో అన్ని ప్రముఖ స్టూడియోస్ కి సంబంధించిన యాక్షన్ సిరీస్ లుప్రసారం చేస్తుంది అయితే క్రమక్రమంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు ఆదరణ తగ్గుతుందని చెప్పాలి. ఈ క్రమంలోనే హాట్ స్టార్ యూజర్లకు నిర్వాహకుల నుంచి మరొక చేదువార్త వస్తుంది అని చెప్పాలి.
మార్చి 31 తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ HBO కంటెంట్ ప్రసారం చేయడం లేదు. ఈ విషయాన్ని అధికారికంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థే వెల్లడించింది. ఇప్పటికే యాప్ లో అందుబాటులో ఉన్న 10 లాంగ్వేజెస్ లోని లక్ష గంటలకుపైగా ఉన్న సినిమాలు, సిరీస్లు, టీవీ షోస్, ఒరిజినల్ సిరీస్ లను చూడచ్చని తెలియజేశారు అయితే మార్చి 31 వ తర్వాత HBOకంటెంట్ టెలికాస్ట్ కాదని తెలియడంతో కొంతమంది సబ్స్క్రైబర్లు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే మార్చి 31 తరువాత డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.