Prakash Raj: కంప్లైంట్ వస్తే కనీసం ఎంక్వైరీ చేయకుండా ఇండస్ట్రీ నుంచి నన్ను బ్యాన్ చేశారు: ప్రకాష్ రాజ్

Prakash Raj: ప్రారంభంలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ అయినా, ఆ తర్వాత హీరోగా కూడా అవకాశాలు వచ్చాయని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. కానీ తానెప్పుడు హీరోగా అనుకోనని, దాన్ని కూడా ఒక క్యారెక్టర్ గానే చూస్తానని ఆయన చెప్పారు. హీరో అంటే డాన్స్ లు బాగా చేయాలని, కానీ తాను అంత బాగా డాన్స్ చేయలేనని ఆయన చెప్పారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మెగాస్టార్ ఇలాంటి వాళ్లను తీసుకుంటే వాళ్ళు డాన్స్ బాగా చేయగలరని, అలా ఎవరి ప్లస్ లు వాళ్ళు చూసుకుని ఆ క్యారెక్టర్ లో నటించాలని, హీరోగా తాను చేయలేనేమోనని ప్రకాష్ రాజ్ అన్నారు.

తానెప్పుడూ ఇండస్ట్రీలో హీరో అవుదామని రాలేదని, ఒక నటుడిగా నిరూపించుకోవడానికి వచ్చానని ఆయన అన్నారు. సినిమాలో ప్రాధాన్యమిచ్చే పాత్రలు చేసి మెప్పించాలని కోరుకున్నట్టు ప్రకాష్ రాజ్ తెలిపారు. నటుడుగానే ఉన్నాను, నటుడిగానే స్టార్ అయ్యానని ఆయన చెప్పారు.

తాను తెలుగు సినీ ఇండస్త్రీ నుంచి 6 సార్లు బహిష్కరించ బడ్డానని ప్రకాష్ రాజ్ అన్నారు. కొంతమంది ప్రొడ్యూసర్స్, మరికొన్ని సార్లు డైరెక్టర్లు కంప్లయింట్ ఇచ్చారని, ఇంకొన్ని సార్లు ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల తనను సినిమాల నుంచి బహిష్కరించారని ఆయన అన్నారు. వాటిని కూర్చొని మాట్లాడుకున్నామని ఆ తర్వాత సర్దుకున్నాయని ఆయన వివరించారు.

ఇకపోతే ఎవర్నీ తప్పు పట్టలేమని, తాను ముక్కు సూటిగా మాట్లాడే మనిషినని ఆయన అన్నారు. దాని వల్ల కొన్ని చోట్ల తాను అలా ఉండకూడదేమో, లేదంటే అలాగే ఉండాలేమో వాళ్ల తప్పేమో అని ఆయన చెప్పారు. కథ ఒకటి చెప్పి, సినిమా తీసేటప్పుడు ఇంకోటి ఉంటే తాను అడుగుతానని అది కూడా ఒక కారణం అయి ఉండవచ్చని ఆయన తెలిపారు. అలాంటి కారణాలు చాలా ఉంటాయని ఆయన అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దగా చేయడం సమంజసం కాదని ఆయన చెప్పారు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఏ సమస్యనైనా ఎదుర్కొన్నామా.. దానికి సమాధానం చెప్పామా.. వెళ్లి కూర్చున్నామా… లేకపోతే తాను తప్పు కాదని అన్నానా.. లేదంటే తన తప్పు తెలుసుకొని ఇంకోసారి మళ్లీ అది రిపీట్ చేయనండి అన్నట్టు ఉండాలి లైఫ్ అంటే ఆని ప్రకాష్ రాజ్ వివరించారు.