శోభన్ బాబు రాముడు వేషం వేసాడని సినిమానే బ్యాన్ చేసిన ప్రజలు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాముడైనా అర్జునుడు అయినా ఆ పాత్ర అన్నగారికి సూటవుతుందని భావించే రోజులవి.ఎన్టీఆర్ ను శ్రీరాముడుగా ఎన్నో చిత్రాలలో చూశారు కానీ మొట్టమొదటిసారిగా బాపు దర్శకత్వంలో రూపొందిన తొలి పౌరాణిక చిత్రం సంపూర్ణ రామాయణం.సంపూర్ణ రామాయణం చిత్రంలో శ్రీ రాముడు పాత్రలో ఎన్టీఆర్ నటిస్తేనే బాగుంటుందనే భావనలో ఉన్న ప్రేక్షకులు వారి ఊహకు అందని విధంగా ఈ సినిమాలో రాముడు పాత్రలో ఎన్టీఆర్ కి బదులు శోభన్ బాబు నటించారు.ఇక అప్పటికే ఎన్టీఆర్ శ్రీరామ పట్టాభిషేకం సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఈ విషయం ఒకసారి ఎన్టీఆర్ కి చెప్పాలని బాపు-రమణలు ఎన్టీఆర్ ని కలిసి అసలు విషయం చెప్పగా చేసుకోండి కాకపోతే నా సినిమా మొదలైతే సమస్యలు వస్తాయని చెప్పారు.

అయితే ఆ మాటలు అన్నింటినీ పట్టించుకోకుండా బాపు-రమణలు ఎంతో నిష్టతో ఈ సినిమాని తెరకెక్కించి
1972 మార్చి 16న ‘ సంపూర్ణ రామాయణం’ చిత్రం విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడంతో అందరూ ఎంతో బాధ పడ్డారు. రాముడి పాత్ర కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే సరిపోతుంది అని మరొకసారి హెచ్చరించిన విధంగా చేశారు.ఇక సినిమా హిట్ కాలేదు అని తెలుసుకున్న శోభన్ బాబు ఇంటి నుంచి బయటకు రావడమే మానేశారు. అలా రెండు వారాలు గడిచిన తర్వాత సినిమా చూడడానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

సినిమా బాగుందనే టాక్ వినిపించడంతో థియేటర్ల ముందు జనాలకి సందడి నెలకొంది. ఇలా థియేటర్లలో హౌస్ ఫుల్ పేరు వినిపించడంతో చిత్రబృందం ఎంతో సంతోషపడ్డారు. ఎన్టీఆర్ రాముడు అయితేనే సినిమా చూస్తాం అని భావించిన ఎంతోమంది సినిమా చూడకుండా ఉండడానికి ఇష్ట పడ్డారు. అయితే సినిమా బాగుందని టాప్ వినిపించడంతో సినిమా చూడకూడదని భావించిన వారు కూడా సినిమా చూడటానికి థియేటర్లకు కదిలారు. అలా ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో రాముడి పాత్ర శోభన్ బాబు చేసినందుకు జనాలు ఆ సినిమాని బ్యాన్ చేసినంత పని చేశారు.