Prakash Raj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో సినిమాలలో నటుడిగా విలక్షణ నటుడిగా తండ్రి పాత్రలో తాత పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.తాజాగా ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో పాల్గొని తన కెరియర్ లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
తాను సినిమాల నుంచి 6 సార్లు బహిష్కరించబడ్డానని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. అది కూడా తెలుగులోనే ఆయన చెప్పుకొచ్చారు. కొంతమంది ప్రొడ్యూసర్స్, మరికొన్ని సార్లు డైరెక్టర్లు కంప్లయింట్ ఇచ్చారని, ఇంకొన్ని సార్లు ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల తనను సినిమాల నుంచి బహిష్కరించారని ఆయన అన్నారు. అలా తనపై 6,7 సార్లు ఫిర్యాదు ఇచ్చారన్న ప్రకాష్ రాజ్, ఆ 6,7 సార్లు కూడా వాళ్లు చెప్పింది మాత్రమే నిజమై ఉండకపోవచ్చు కదా అని ఆయన అన్నారు. దానికి చాలా కారణాలుంటాయని, వాటిని కూర్చొని మాట్లాడుకున్నామని ఆ తర్వాత సర్దుకున్నాయని ఆయన వివరించారు.
ఇకపోతే ఎవర్నీ తప్పు పట్టలేమని, తాను ముక్కు సూటిగా మాట్లాడే మనిషినని ఆయన అన్నారు. దాని వల్ల కొన్ని చోట్ల తాను అలా ఉండకూడదేమో, లేదంటే అలాగే ఉండాలేమో వాళ్ల తప్పేమో అని ఆయన చెప్పారు. కథ ఒకటి చెప్పి, సినిమా తీసేటప్పుడు ఇంకోటి ఉంటే తాను అడుగుతానని అది కూడా ఒక కారణం అయి ఉండవచ్చని ఆయన తెలిపారు. అలాంటి కారణాలు చాలా ఉంటాయని ప్రకాష్ రాజ్ అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దగా చేయడం సమంజసం కాదని,ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఏ సమస్యనైనా ఎదుర్కొన్నామా.. దానికి సమాధానం చెప్పామా.. వెళ్లి కూర్చున్నామా… లేకపోతే తాను తప్పు కాదని అన్నానా.. లేదంటే తన తప్పు తెలుసుకొని ఇంకోసారి మళ్లీ అది రిపీట్ చేయనండి అన్నట్టు ఉండాలి లైఫ్ అంటే ఆని ప్రకాష్ రాజ్ వివరించారు.