కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ ను పొందవచ్చనే సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ద్వారా భార్యాభర్తలు నెలకు 10,000 రూపాయలు పొందవచ్చు. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఆదాయం కోరుకునే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తి ఈ స్కీమ్ లో చేరే ఛాన్స్ అయితే ఉంటుంది. బ్యాంకుకు నేరుగా వెళ్లడం లేదా ఆన్ లైన్ ద్వారా ఈ స్కీమ్ లో సులభంగా చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 40 ఏళ్ల వయస్సులో ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు నెలకు 210 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
పెన్షన్ పొందాలనుకునే మొత్తం ఆధారంగా ప్రతి నెలా చెల్లించే మొత్తం మారుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ స్కీమ్ ద్వారా 4 కోట్ల మంది బెనిఫిట్ పొందుతున్నారు. దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం ఆదాయం పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. రిటైర్మెంట్ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఎవరూ చెప్పలేరనే సంగతి తెలిసిందే.
అటల్ పెన్షన్ యోజన స్కీమ్ గురించి సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ కావడంతో ఈ స్కీమ్ ఎలాంటి రిస్క్ లేని స్కీమ్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఉన్న స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.