మనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో నల్లని పెదాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్య వల్ల కొంతమంది బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు సులువుగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రాత్రి పడుకునే సమయంలో నిమ్మకాయను కట్ చేసి నిమ్మకాయ జ్యూస్ ను పెదాలపై అప్లై చేస్తే మంచిది.
ఈ విధంగా చేయడం వల్ల పెదాల రంగు మారే అవకాశం ఉంటుంది. హైపర్ పిగ్మంటేషన్ వల్ల కూడా కొంతమందిలో పెదాల రంగు మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కాలుష్యం, సూర్య కిరణాల వల్ల కూడా పెదాల రంగు మారే అవకాశాలు అయితే ఉంటాయి. తేనె, గ్లిజరిన్ కలిపి పెదాలను శుభ్రం చేయడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
పాలలో పసుపు వేసి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయడం ద్వారా కూడా ఈ సమస్య దూరమవుతుంది. పెదాలపై కొబ్బరి నూనెను రాయడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. తేనెలో రోజ్ వాటర్ కలిప్ పెదాలపై మర్ధనా చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ను పొందవచ్చు.
ఈ చిట్కాలు పాటించినా సమస్య పరిష్కారం కాకపోతే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు. పెదాలు నల్లగా ఉండటం చిన్న సమస్య అయినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు మాత్రం అన్నీఇన్నీ కావు. ఆలోవెరా జెల్ సైతం ఈ సమస్యకు చెక్ పెట్టడంలో కొంతమేర ఉపయోగపడుతుంది. దోసకాయ రసంను పెదాలపై అప్లై చేయడం వల్ల సమస్య దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.