ఐస్ క్రీమ్ ఎక్కువగా తింటున్నారా. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.

చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు ఐస్ క్రీం అంటే ఇష్టం లేవారంటు ఉండరు. వేసవి కాలం అంటే చల్ల చల్లని ఐస్ క్రీం అందరికీ గుర్తొస్తుంది. ఈ మధ్యకాలంలో సీజన్ సంబంధం లేకుండా వేసవికాలం, శీతాకాలంలో కూడా ఐస్ క్రీం తినేవారి సంఖ్య పెరిగిపోయింది. రంగురంగుల కలర్లలో అద్భుతమైన రుచితో నోరూరించే ఐస్ క్రీం చూడగానే తినాలనిపిస్తుంది. అయితే ఈ ఐస్ క్రీం ఎక్కువగా తినటం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఐస్ క్రీం ఎక్కువగా తినే వారు ఈ విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఐస్ క్రీమ్ ఎక్కువగా తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అప్పుడప్పుడు ఐస్ క్రీం తినటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ఎక్కువగా ఐస్ క్రీం తినటం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవు. ఐస్ క్రీం మన ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల ప్రోటీన్లు, విటమిన్లు, పోషకాలు దాగి ఉంటాయి. ఎందుకంటే ఐస్ క్రీమ్ తయారు చేయడానికి పాలు ఉపయోగిస్తారు. పాలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజూ పాలు తాగటం లేదా పాల ఉత్పత్తులు తినటం వల్ల మన శరీరానికి కావలసిన కాల్షియం లభించింది శరీరంలో ఎముకలు కండరాలు దృఢంగా ఉంటాయి. అందువల్ల అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ తినటం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ఇక ఇప్పుడు ఐస్ క్రీమ్ తినడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. ఏ ఆహార పదార్థాల నైనా నిజంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అలా కాకుండా ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఐస్ క్రీం విషయంలో కూడా అంతే. ఐస్ క్రీమ్ ఎక్కువగా తినటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఐస్ క్రీం తయారు చేయడానికి చక్కెర ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా వెన్న, చాక్లెట్‌తో తయారు చేసిన ఐస్‌క్రీమ్‌లో కేలరీలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి హానికరం. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధ పడేవారు ఐస్ క్రీం తినకపోవడం మంచిది. శరీర బరువు పెరగటమే కాకుండా తలనొప్పి, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక ఐస్ క్రీం తరచూ కాకుండా అప్పుడప్పుడు తినడం వల్లే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.