భార్యలకు ఈ సమస్యలు రావడానికి భర్త చేసే తప్పులే కారణమా?

Family-Demands-Husband-wife-fight

వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఇద్దరి మధ్య ప్రేమ అనురాగాలు, ఆర్థిక అంశాలు బలంగా ఉండడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇంటి పనులన్నీ చక్కబెట్టి పిల్లల ఆలనా పాలనా చూసుకునే మహిళలు అనారోగ్య సమస్యలతో బాధపడితే ఆ కుటుంబం చిన్న విన్నమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కొందరు భర్తలు చేసే పొరపాట్ల వల్లే భార్యల ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోందని తాజా సర్వేలు చెబుతున్నాయి. కుటుంబంలో మహిళల అనారోగ్యానికి పురుషులు ఏ విధంగా కారణం అవుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

కొందరు పురుషులు నియంతృత్వ ధోరణిలో కుటుంబ వ్యవహారాలను అసలు పట్టించుకోకుండా మొత్తం స్త్రీలపైనే భారం వేస్తుంటారు. ఫలితంగా ఉదయం లేచినప్పటి నుంచి ఇల్లు తుడవడం, వంట చేయడం, పిల్లల సంరక్షణ, పిల్లల్ని స్కూలుకు పంపడం, డబ్బు సంపాదన ఇలా రాత్రి పడుకునే దాకా తీవ్ర ఒత్తిడిని అనుభవించి మానసిక శారీరక ఆరోగ్యానికి కారణం అవుతున్నారట. కనుక వీలైనప్పుడల్లా ఇంటి పనుల్లో మీ భార్యకు కొంత సాయంగా ఉండడం మర్చిపోవద్దు.

కొందరు పురుషులు తాగుడుకు బానిసై ఇంట్లో భార్యని వేధించడం కొట్టడం వంటివి చేస్తుంటారు ఫలితంగా మహిళలు తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతారు.కొందరు పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎన్నో సుఖ వ్యాధులకు గురై తమ భార్యలకు కూడా సంక్రమింపజేస్తుంటారు.ఫలితంగా మహిళలు తీవ్ర అనారోగ్య సమస్యలు అనుభవిస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అనేక సర్వేలో స్పష్టమైనది. కొంత మంది భర్త‌లు ఎలాంటి చెడు అల‌వాట్లు లేక‌పోయినా భార్యపై అనుమానం పెంచుకోవడం, కట్నం కోసం వేధించడం వంటి చర్యల వల్ల మహిళలు తీవ్ర ఒత్తిడి, డిప్రెషన్ వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.