భర్తలు పొరపాటున ఈ విషయాలు భార్యకు చెప్పారో మీ బంధం తెగిపోయినట్లే!

istockphoto-1267283776-612x612

సాధారణంగా భార్యాభర్తల మధ్య బంధం పది కాలాలపాటు మంచిగా ఉండాలి అంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఎంతో అవసరం. అయితే ప్రతి ఒక్క విషయం భర్త భార్య దగ్గర చెబితే లేనిపోని గొడవలు చోటుచేసుకుని ఆ గొడవలు మీ బంధం విడగొట్టుకునేంతవరకు తెచ్చుకుంటారు. అలాంటి పొరపాట్లు మీ జీవితంలో జరగకుండా ఉండాలంటే కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకే పొరపాటున కూడా కొన్ని విషయాలు భర్త భార్య దగ్గర చెప్పకూడదు.

ముఖ్యంగా మీ భార్య తల్లిదండ్రులను మరియు ఆమె తరపు బంధువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇలా మీ భార్య తరపు వారి గురించి మీరు చులకనగా మాట్లాడితే మీ మధ్య గొడవలు చోటుచేసుకునే అవకాశాలు ఉంటాయి కనుక వారి విషయంలో జాగ్రత్తగా ఉండడమే మంచిది. అసలు ఇలాంటి విషయాలను ఇద్దరి మధ్య ప్రస్తావనకు తీసుకురాకపోవడమే మరీ మంచిది.

ఇక చాలామందికి ఇతర వ్యక్తులతో తమ కుటుంబ సభ్యులను పోల్చి చూసే అలవాటు ఉంటుంది. పొరపాటున కూడా ఇతర భార్యలతో మీ భార్యను పోల్చి చూడకండి అలా పోలుస్తూ మాట్లాడితే మీ బంధం అక్కడితో తెగిపోతుందని అర్థం. ఎందుకంటే ఏ భార్య అయినా కూడా తమ భర్త తమని మంచిగా పొగడాలి కానీ ఇతర భార్యలను పొగుడుతూ తమని చులకన చేస్తే అసలు తట్టుకోలేరు.ఇక ఏ మనిషి అయినా కూడా జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు చేయడం సర్వసాధారణం అయితే మీ భార్య తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తే కనుక ఆ తప్పులను ప్రతిసారి వారికి తెలియజేస్తూ వారిని బాధ పెట్టకూడదు ఇలా కనుక చేస్తే మీ మధ్య ఉండే గొడవలు పెరిగిపోయి మీ బంధం తెగిపోయే అవకాశాలు ఉంటాయి.