ఇతర కాలాలతో పోల్చి చూస్తే శీతాకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయనే సంగతి తెలిసిందే. పిల్లలు శీతాకాలంలో ఎక్కువగా దగ్గుతూ ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తేనెతో వెల్లుల్లి రెబ్బలను కలిపి పిల్లలకు ఇస్తేసమస్య సులువుగా దూరమవుతుందని చెప్పవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉన్న పసుపును గోరువెచ్చని పాలలో కలిపి తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశాలు ఉంటాయి.
యూకలిప్టస్ ఆయిల్ ను దిండుపై వేసి వాసన పీల్చుకుంటే ముక్కుదిబ్బడ సమస్యతో పాటు ఇతర సమస్యలు సైతం దూరమవుతాయి. పిల్లలకు తేనె, తులసి ఆకుల రసం కలిపి ఇవ్వడం ద్వారా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. పిల్లలకు త్వరగా దగ్గు తగ్గాలంటే జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం ఇవ్వాలి. పిల్లలకు ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇస్తే మంచిదని చెప్పవచ్చు. ఆవిరి యంత్రాల సహాయంతో పిల్లలకు ఆవిరి పట్టడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి.
పిల్లల ముక్కును దూదితో శుభ్రం చేసి గాలి పీల్చడం ద్వారా మంచి నిద్ర పట్టే అవకాశాలు అయితే ఉంటాయి. పిల్లలు నిద్రపోయే సమయంలో తలకింద దిండు పెడితే మంచిది. ముక్కును తడిమిన ప్రతిసారి పిల్లలు చేతులు శుభ్రంగా కడుక్కుంటే మంచిది. పిల్లలకు దగ్గు, జలుబు వచ్చిన సమయంలో తల్లితో పాటు వేరే గదిలో బిడ్డ పడుకుంటే మంచిదని చెప్పవచ్చు.
పిల్లలతో గోరువెచ్చని నీరు తాగించడం వల్ల పిల్లలకు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశాలు అయితే ఉంటాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో తప్పులు చేస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.