ఏపీపీఎస్సీలో 99 పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగ ఖాళీలు.. నెలకు ఏకంగా రూ.98,400 వేతనంతో?

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 99 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 2023 సంవత్సరం జులై 1వ తేదీ నాటికి 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మౌఖిక పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 56100 రూపాయల నుంచి 98400 రూపాయల మధ్య వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. 2024 సంవత్సరం జనవరి 29వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2024 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

2024 సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. http://psc.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. సంబంధిత బ్రాంచ్ లో ఫస్ట్ క్లాస్ లో బీఈ, బీటెక్, బీఫార్మసీ, పీజీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది.

కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. సంబంధిత టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.