దర్శ అమమాస్య గురించి ఈ విషయాలు తెలుసా.. చంద్రుడిని ఎందుకు ఆరాధిస్తారంటే?

ప్రతి నెల కృష్ణ పక్షం చివరి తేదీన అమావాస్య వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన దర్శ అమవాస్య వస్తుంది. పితృ దోషం నుండి బయటపడేందుకు ఈ అమావాస్య చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు. దర్శ అమవాస్య రోజున చంద్ర దేవుని ఆరాధన గురించి కొన్ని కీలక విషయాలను తెలుసుకుంటే మంచిది.

దర్శ అమావాస్య నాడు చంద్రదేవుని పూజించే సంప్రదాయం ఉండగా ఈరోజు చంద్రుడు పూర్తిస్థాయిలో అదృశ్యం అవుతాడు. జాతకంలో చంద్రుడు బలపడాలంటే దర్శ అమావాస్య నాడు ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుడిని పూజిస్తే మంచిది. దర్శ అమావాస్య నాడు సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంటి దక్షిణ దిక్కున 16 నువ్వుల నూనె పెట్టడం శుభప్రదం అని చాలామంది భావిస్తారు.

దర్శ అమావాస్య రోజున కర్పూరంలో బెల్లం, నెయ్యి పోసి హారతి ఇవ్వడం ద్వారా పితృ దోషాన్ని తొలగించుకోవచ్చు. గంగాజలంలో స్నానమాచరించి, పేదవారికి అన్నదానం, వస్త్రాలు తదితరాలను దానం చేస్తే ఇంట్లో సుఖశాంతులు నెలకొనే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేకుండా ఉండటంతో పాటు అదృష్టం సైతం పెరిగే అవకాశాలు ఉంటాయి.

దర్శ అమవాస్య రోజు ఈ నియమాలను పాటించడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. దర్శ అమావాస్య హిందూ మతంలో ముఖ్యమైన పండుగగా పరిగణించబడుతుందని చెప్పవచ్చు. దర్శ అమావాస్య రాత్రి రావి చెట్టు క్రింద ఆవాల నూనెతో దీపం వెలిగించి కోరికలు నెరవేర్చుకోవచ్చు.