పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు.. నెలకు ఏకంగా రూ.35 వేల వేతనంతో?

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 108 ఆఫీస్‌ అటెండెంట్‌ (గ్రూప్‌ సీ) పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా చివరి తేదీ అక్టోబర్‌ 21గా ఉంది. పదో తరగతి పాసైన అభ్యర్థులు సైతం ఈ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.35,000 వేతనం లభిస్తుంది. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.nabard.org వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 108 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ముంబైలో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ప్రతి నెలా రూ. 35,000 వేతనంగా లభించనుంది. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తులు ఇవ్వడానికి అక్టోబర్‌ 21, 2024 చివరి తేదీగా ఉంది.

https://www.nabard.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.