రాత పరీక్ష లేకుండానే భారీ సంఖ్యలో బ్యాంక్ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

మన దేశంలో నిరుద్యోగుల సంఖ్య భారీ స్థాయిలో ఉంది. సరైన ఉద్యోగం దొరకక చాలామంది కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనే సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు తరచూ జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తూ నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ అందిస్తున్నాయి. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఉద్యోగ ఖాళీల కోసం తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.

అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. www.idbibank.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సెప్టెంబర్ నెల 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. మొత్తం 56 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా ఈ ఉద్యోగ ఖాళీలలో 25 అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఖాళీలు, 31 మేనేజర్-గ్రేడ్ బీ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

28 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (గ్రేడ్ సీ) ఉద్యోగ ఖాళీలకు అర్హులు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ / డేటా సైన్స్‌ కోర్సు పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మేనేజర్ గ్రేడ్ బి ఉద్యోగాలకు మాత్రం 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.

అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (గ్రేడ్‌ సీ) ఉద్యోగానికి ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 1,28,000, మేనేజర్‌ (గ్రేడ్‌ బీ) ఉద్యోగానికి ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 98,000 వరకు వేతనం లభిస్తుంది. ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.