నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతొ 17,727 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరేలా గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం కంబైన్డ్ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరేలా గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024 జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 17,727 ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్ నార్కోటిస్ట్, అప్పర్ డివిజన్ క్లర్క్, టాక్స్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలతో పాటు అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు సైతం ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా కొన్ని ఉద్యోగ ఖాళీలకు మాత్రం అదనపు అర్హతలు ఉండాలని సమాచారం అందుతోంది. https://ssc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జులై 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఇందుకు సంబంధించిన రాత పరీక్ష జరగనుంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఉండటంతో ఆ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఎక్కువ మొత్తం వేతనం లభించనుంది.

పోస్టులను బట్టి వయోపరిమితి మారుతుందని సమాచారం అందుతోంది. రిజర్వేషన్లు, ఇతర నిబంధనల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. సాధారణ అభ్యర్థులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాగులు, మహిళలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదని తెలుస్తోంది.