ఏపీ తపాలా శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. దేశంలో ఉన్న వేర్వేరు పోస్టల్ సర్కిళ్లలో 21,413 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.
ఈ ఉద్యోగ ఖాళీల విషయానికి వస్తే ఏపీలో 1215, తెలంగాణలో 519 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ జాబ్స్ కు ఎంపికైన వాళ్లు రోజుకు కేవలం 4 గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్స్ లభిస్తాయని చెప్పవచ్చు. విధులు నిర్వర్తించడానికి అవసరమైన సామాగ్రిని పోస్టల్ శాఖ అందిస్తుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. మార్చి నెల 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు పోటీ సైతం ఒకింత ఎక్కువగానే ఉంటుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
తెలుగు సబ్జెక్ట్ ను పదో తరగతి వరకు చదివిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ వచ్చి ఉండాలి. అనుభవం ఆధారంగా వేతనం పెరుగుతుందని చెప్పవచ్చు.