ఏపీలో కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్.. ఎవరెవరు ఈ సిలిందర్ పొందవచ్చంటే?

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బెనిఫిట్ కలిగేలా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్ ఏపీలో కూడా అమలైతే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొన్ని రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. సిలిండర్ ను ఇప్పుడు బుకింగ్ చేసుకోవడం ద్వారా తగ్గింపు బెనిఫిట్స్ ను పొందవచ్చు.

ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ కనెక్షన్ ను పొందిన వాళ్లు ఈ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లో భాగంగా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వాళ్లకు సబ్సిడీ అందిస్తుండగా ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు సబ్సిడీ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు ఏకంగా గ్యాస్ సిలిండర్ అసలు ధరపై 300 రూపాయల డిస్కౌంట్ లభించే అవకాశం ఉంటుంది.

ఈ స్కీమ్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకున్న వాళ్లు 560 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను పొందవచ్చు. వచ్చే ఏడాది మార్చి చివరి వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఎలాంటి స్కీమ్ అవసరం లేకుండానే ఉజ్వల స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న వాళ్లకు బెనిఫిట్స్ లభిస్తాయి. సాధారణ ప్రజలకు మాత్రం 860 రూపాయలకు సిలిండర్ లభిస్తుంది.

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లేని వాళ్లు ఉజ్వల స్కీమ్ ద్వారా గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకోవడం ద్వారా స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ను తక్కువ ధరకే పొందడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.