ఏపీలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతో కాంట్రాక్ట్ ఉద్యోగ ఖాళీలు!

ఏపీలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 97 స్టాఫ్ నర్స్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నరని తెలుస్తోంది. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

జూన్ నెల 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. స్టాఫ్ నర్స్(జీఎన్ఎం) ఉద్యోగ ఖాళీలు 43 ఉండగా స్టాఫ్ నర్స్ (బీఎస్సీ నర్సింగ్) ఉద్యోగ ఖాళీలు 23, స్టాఫ్ నర్స్ (ఎంఎస్సీ నర్సింగ్) ఉద్యోగ ఖాళీలు 26 ఉన్నాయి. మొత్తం 97 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.

జీఎన్ఎం, బీఎస్సీ(నర్సింగ్), ఎంఎస్సీ (నర్సింగ్) చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అకాడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుంది.

ఓసీ, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 400 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.