కూరగాయలు ఎక్కువరోజులు తాజాగా ఉండాలా.. పాటించాల్సిన అద్భుతమైన చిట్కాలివే!

సాధారణంగా ఇతర కాలాలతో పోల్చి చూస్తే వేసవికాలంలో ఆకు కూరలు, కూరగాయలు త్వరగా పాడవుతాయనే సంగతి తెలిసిందే. పండ్లు, కూరగాయలు ఫ్రిజ్ లో పెడితే సాధారణంగా తాజాగా ఉంటాయి. వేసవికాలంలో ఫ్రిజ్ లో పెట్టినా కొన్నిసార్లు కూరగాయలు పాడయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కూరగాయలు, పండ్లలో ఎక్కువ మొత్తంలో ఎంజైమ్స్ ఉంటాయి. కూరగాయలు, పండ్లు ఇథలీన్‌ని ఉత్పత్తి చేయడం వల్ల ఇవి త్వరగా కుళ్లిపోతాయి.

యాపిల్స్, పుచ్చకాయలు, కివీస్ పండ్లతో క్యాబేజీ కలపకూడదు. యాపిల్, ద్రాక్ష, అంజీర్ వంటి పండ్లతో సొరకాయ, పొట్లకాయలను కలపకూడదు. ఆపిల్, అత్తి, ద్రాక్ష పండ్ల వంటి ఇథిలీన్ ఉత్పత్తి చేసే పండ్లతో బ్రకోలీని కలపడం ద్వారా పండ్లు త్వరగా పాడయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆకు కూరలు తాజాగా ఉండాలంటే వాటిని ప్రత్యేకంగా ప్యాక్ చేసి ఉంచడం మంచిది.

ఇథలీన్ రిలీజ్ చేసే పండ్లు, కూరగాయలతో ఇతర పండ్లు, కూరగాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ కలపకూడదు. ఆకు కూరలను ఎక్కువగా వినియోగించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. తరిగిన కూరగాయలు పాడవకుండా ఉండాలని భావించే వాళ్లు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బంగాళదుంపలు, క్యారెట్, ముల్లంగి కట్ చేసి ఫ్రిజ్ లో పెడితే అవి మృదుత్వాన్ని కోల్పోయే అవకాశం అయితే ఉంటాయి.

దుంప జాతి కూరగాయలను ఉదయాన్నే కట్ చేసి తాజాగా వండుకుంటే అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఆకుకూరలను ఫ్రిజ్ లో పెట్టుకోవాలంటే వాటిని కొమ్మల నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. తరిగిన ఆకు కూరలు కేవలం రెండు రోజులు మాత్రమే ఫ్రెష్ గా ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి.