కేవలం 9 నెలల్లోనే ఏకంగా 32 కిలోలు తగ్గిన మహిళ.. ఆమె బరువు ఎలా తగ్గారంటే?

ప్రస్తుత కాలంలో చాలామంది యువతీయువకులకు బరువు తగ్గడం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఎక్కువ బరువు ఉండటం వల్ల యువతీయువకులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఒక మహిళ మాత్రం ఏకంగా 32 కిలోల బరువు తగ్గడం ద్వారా వార్తల్లో నిలిచారు. 9 నెలల్లోనే 32 కిలోలు తగ్గిన మహిళ సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

ఈ స్థాయిలో బరువు తగ్గడం సులువైన విషయం కాదని అయితే ఆ మహిళ మాత్రం సులువుగానే బరువు తగ్గి ప్రశంసలు అందుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎంతోమందిని వేధిస్తున్న సమస్యలలో ఊబకాయం ఒకటి కాగా అమీ మేయర్ అనే యువతి 92 కిలోల బరువు వల్ల తన పనులను తనే చేసుకునే విషయంలో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది.

ఎక్కువ బరువు ఉండటం వల్ల ఆమె ఎన్నో అవమానాలకు గురయ్యారు. అయితే పక్కా డైట్ ప్లాన్ ను ఫాలో కావడం వల్ల ఆమె సులువుగానే బరువు తగ్గారు. తాను బరువు తగ్గడంలో 3 పదార్థాలు కీ రోల్ పోషించాయని ఆమె చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోను సైతం అమీ మేయర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

గ్రీన్ యోగర్ట్, చియా సీడ్స్, అవకాడో తాను బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషించాయని ఆమె అన్నారు. ప్రోటీన్ అధికంగా ఉన్న గ్రీన్ యోగర్ట్, చిరుతిండి తినాలనే కోరికను అదుపు చేసే చియా సీడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మోనో శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా కలిగి ఉన్న అవకాడో బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషించాయని ఆమె చెబుతున్నారు. బరువు తగ్గిన మహిళను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.