మనలో చాలామంది ఎక్కువ కాలం జీవించాలని భావిస్తూ ఉంటారు. కొన్ని అలవాట్లను అలవరచుకోవడం ద్వారా సులువుగా ఆయుష్షును పెంచుకునే అవకాశం ఉంటుంది. సరైన పోషకాహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చు. ఆయురారోగ్యాలతో జీవించాలని భావించే వాళ్లు ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
ప్రతిరోజూ వాకింగ్ చేయడం ద్వారా ఆయుష్షు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. వాకింగ్ చేయడం ద్వారా ఆయుష్షు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. సృజనాత్మకతను వెలికితీసే వ్యాపకాలను కలిగి ఉంటే వాళ్ల ఆయుష్షు ఇతరుల ఆయుష్షు కంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది.
రాత్రి సమయంలో స్మార్ట్ ఫోన్ ను చూడటానికి బదులుగా బుక్స్ చదివితే మంచిదని చెప్పవచ్చు. పుస్తక పఠనం అలవాటు ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సామాజిక జీవితం సాఫీగా ఉండే స్త్రీ పురుషులకు ఆయుష్షు ఎక్కువ రోజులు ఉంటుందని చెప్పవచ్చు. సామాజిక బంధాలు పెంపొందించుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు.
ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా కూడా ఆయుష్షు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేస్తే మహిళల, పురుషుల ఆయుష్షు పెరుగుతుందని చెప్పవచ్చు. మహిళలు, పురుషులు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.సరైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండటం ద్వారా ఆయురార్ధంను పెంచుకోవచ్చు. ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించడం ద్వారా ఆయుష్షు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.