బరువు తగ్గాలని కడుపు మాడ్చుకుంటున్నారా.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

మనలో చాలామంది బరువు పెరగడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. అధిక బరువు ఎన్ని సమస్యలకు కారణవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరీర ఆకారాన్ని చూసుకుని కుంగిపోతూ ఆత్మన్యూనతాభావంతో ఒంటరిగా ఉండటానికి బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు ప్రాధాన్యత ఇస్తారు. అధిక బరువు వదిలించుకోవాలని అనుకునేవారు తినటం మానేసి కడుపు మాడ్చుకుంటూ ఉండటానికి చాలామంది ప్రాధాన్యత ఇస్తారు.

అయితే ఈ విధంగా చేయడం కంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గినా డీహైడ్రేషన్ సమస్య తలెత్తి నీరసం తలెత్తే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ కాలం తినకుండా ఉంటే రోగనిరోధక శక్తి తగ్గి ఇతర వ్యాధుల బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. జిమ్‌లో వర్కవుట్లు చేయకుండానే ఆహారం, జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే బరువును అదుపులో చేసుకోవచ్చు.

ప్రతిఒక్కరూ రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. జంక్‌ఫుడ్, వేపుళ్లు, బేకరీ పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మేలు కలుగుతుంది. పండ్లు, ఆకుకూరలు, సలాడ్లు తినటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంతో పాటు మెరిసే చర్మం సొంతమయ్యే అవకాశం ఉంటుంది. చక్కెరకు బదులుగా బెల్లం, తేనెలు తీసుకుంటూ ఉండటం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.

రోజూ కనీసం గంటైనా చిన్నపాటి ఆసనాలు వేస్తూ ఉంటే సులువుగా బరువు తగ్గవచ్చు. ఎంత తిన్నా, ఎన్ని వర్కవుట్లు చేసినా శరీరానికి తగినంత విశ్రాంతి లేకపోతే వృథా అని చెప్పవచ్చు. నాణ్యమైన నిద్రతోనే మనసు, శరీరం పునరుత్తేజం పొందుతాయని కచ్చితంగా చెప్పవచ్చు.