నెలసరి సక్రమంగా రాకపోవడం వల్ల చాలామంది మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కొంతమంది మహిళలు ఏళ్ల తరబడి ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. వేర్వేరు ఆరోగ్య కారణాల వల్ల మహిళలు ఈ తరహా సమస్యలను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడే ఆడవాళ్లను ఎక్కువగా ఈ సమస్య వేధిస్తుంది.
హార్మోన్ల అసమతుల్యత, బరువు వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే సరైన సమస్యను గుర్తిస్తే మాత్రమే పీరియడ్స్ సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంటుంది. పళ్లు, సలాడ్లు తీసుకోవడం ద్వారా నెలసరి సమస్యలు దూరమవుతాయని చెప్పవచ్చు.
టమాటా, కీరా, క్యారెట్ తినడం వల్ల నెలసరి సమస్య దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది. మీల్ మేకర్, సోయా పనీర్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధ పడేవారు వైద్యుల సలహాల ప్రకారం సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. మాంసం, చికెన్, ఆకుకూరలు, ఉడికించిన గింజలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ఐరన్ లభిస్తుంది.
అల్పాహారాలు, చిరుతిళ్లు, వేయించిన కూరలను వీలైనంత తక్కువగా తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఫాస్ట్‌ఫుడ్స్, స్వీట్లు, చాక్‌లెట్లు, కేకులు, బిస్కెట్లు, బేకరీ ఫుడ్స్ కు దూరంగా ఉంటే మంచిది. రోజుకు రెండున్నర నుండి మూడు లీటర్ల నీళ్లు తాగడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.