కాంటాక్ట్ లెన్స్ ఎక్కువగా వాడుతున్నారా.. ఈ తప్పులు చేస్తే మాత్రం చాలా ప్రమాదమా?

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని దృష్టిలోపం సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. దృష్టి లోపం సమస్యలతో బాధ పడేవారు కాంటాక్ట్ లెన్స్ వాడటం ద్వారా ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. కాంటాక్ట్ లెన్స్ వాడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు సైతం ఉండవనే సంగతి తెలిసిందే. అయితే కాంటాక్ట్ లెన్స్ ను ఎక్కువగా వాడేవాళ్లు మాత్రం కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

కాంటాక్ట్ లెన్స్ వల్ల కంటి ఇన్ఫెక్షన్ల బారిన పడితే కొన్నిసార్లు కంటిచూపును కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాంటాక్ట్ లెన్స్ వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమస్యల వల్ల కంటిచూపును కోల్పోతే మాత్రం కార్నియా ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. స్నానం చేసే సమయంలో కాంటాక్ట్ లెన్స్ ను తొలగించి స్నానం చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

కాంటాక్ట్ లెన్స్ ధరించి నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు. కాంటాక్ట్ లెన్స్ ను కేవలం వైద్యులు సూచించిన క్లీనింగ్ ద్రావణంతో మాత్రమే క్లీన్ చేయాల్సి ఉంటుంది. కంటికి పాత లెన్స్ ను ఉపయోగించడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సంగతి తెలిసిందే.

కాంటాక్ట్ లెన్స్ ను తాకే సమయంలో చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మంచిది. కాంటాక్ట్ లెన్స్ విషయంలో వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. కళ్ల విషయంలో సొంత ప్రయోగాలు చేయడం ఏ మాత్రం మంచిది కాదు. కాంటాక్ట్ లెన్స్ ను ఇప్పటికే వాడుతున్న వాళ్లు సైతం ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.