మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో మలబద్ధకం సమస్య వల్ల ఇబ్బందులు పడుతుంటారు. మలబద్ధకం సమస్య చిన్న సమస్యలా అనిపించినా కలిగించే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మలబద్ధకం సమస్యను ఇతరులకు చెప్పుకోవడానికి కూడా కూడా చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. డైట్ విషయంలో మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యకు సులువుగా చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది.
పోషకాల లోపం, ఒత్తిడి, తగినంత నీరు తాగకపోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి. మంచి పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. బాగా వర్కౌట్లు చేయడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రో బయోటిక్స్, మెగ్నీషియం, ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు.
పెరుగు, బీన్స్, ఆకుకూరలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమాటాలు, పండ్లు తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్, కొవ్వు ఎక్కువగా ఉన్న ఫుడ్స్, ఫ్రై చేసిన ఫుడ్స్, చాక్లెట్స్ తినడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. తొలి దశలోనే ఈ సమస్యకు చెక్ పెట్టాలి. సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
ఎన్ని చిట్కాలు పాటించినా సమస్య తీవ్రత తగ్గకపోతే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మలబద్ధకం సమస్య విషయంలో నిర్లక్షయంగా వ్యవహరిస్తే ప్రాణాలకే అపాయం కలుగుతుందని చెప్పవచ్చు.