ఈ పానీయం తాగితే కొలెస్ట్రాల్ సులువుగా కరిగిపోతుందట.. ఏం చేయాలంటే?

ప్రస్తుత కాలంలో చాలామంది శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ కావడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. మనిషి ఆయుష్షును తగ్గించే వాటిలో కొలెస్ట్రాల్ ఒకటని చెప్పవచ్చు. ఎక్కువ బరువు ఉన్నవాళ్లను ఈ సమస్య ఎక్కువగా వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. జిమ్, వ్యాయామం, నడక ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

మన శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో తులసి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. తులసి ఇమ్యూనిటీ పవర్ ను బలపరచడంతో పాటు గుండెకు ఎంతగానో మేలు చేకూరుస్తుంది. ఒక గిన్నెలో పావు లీటర్ నీటిని పోసి అందులో కొద్దిగా అల్లం తురుము వేసి వడపోసి వేడివేడిగా తాగితే మంచిది. చల్లగా ఉన్న సమయంలో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.

తులసి ఆకులను డైరెక్ట్ గా నమిలి తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నమిలి తినడం వల్ల పళ్లకు సంబంధించి సమస్యలు వస్తాయి. అందువల్ల తులసి ఆకులను టీ ద్వారా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. తులసి ఆకుల వల్ల కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు.

తులసిని టీలో తీసుకోవడం సాధ్యం కాని పక్షంలో తులసి రసాన్ని తీసుకుంటే మంచిది. తులసి విషయంలో ఈ చిట్కాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తులసి వల్ల ఆరోగ్యానికి లాభమే తప్ప నష్టం లేదు.