మనలో చాలామంది కొవ్వు సంబంధిత సమస్యల వల్ల నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని రకల వ్యాయామాలు చేయడం ద్వారా పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించడం సాధ్యమవుతుంది. బరువు తగ్గడానికి కొంతమంది జిమ్ పై ఆధారపడుతున్నా జిమ్ విషయంలో సరైన సమయపాలన పాటించలేకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దాల్చిన చెక్కను డైట్ లో భాగం చేసుకుంటే సులువుగా బరువు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది.
కొవ్వును దాల్చిన చెక్క వేగంగా కరిగిస్తుంది. సీజనల్ ఫ్రూట్ అయిన పియర్స్ ను తరచూ తీసుకోవడం వల్ల కూడా కొవ్వును కరిగించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బరువును తగ్గించడంలో గ్రీన్ టీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. వేగంగా బరువు తగ్గాలని భావించే వాళ్లు గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా ఎన్నో లాభాలను పొందవచ్చు. బ్లాక్ పెప్పర్ తీసుకోవడం ద్వారా కూడా కొవ్వును కరిగించుకునే అవకాశం ఉంటుంది.
కొవ్వు కరిగించే కొన్ని విత్తనాలు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గుమ్మడి విత్తనాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. గుమ్మడి గింజల్లో ఉండే జింక్ వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయే అవకాశం ఉంటుంది. వాటర్ క్రెస్ తీసుకోవడం ద్వారా కూడా సులభంగా హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. వాటర్ క్రెస్ ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.
ఫైబర్ పుష్కలంగా ఉన్న అవిసె గింజలు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. నడుము చుట్టూ ఉండే కొవ్వును ఈ గింజలు కరిగిస్తాయి. పుచ్చకాయ విత్తనాలు తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్, పొటాషియం లభిస్తుంది. జనపనార విత్తనాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతోంది.