అధిక రక్తపోటు సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలివే!

ప్రస్తుత కాలంలో చాలామందిని అధిక రక్తపోటు సమస్య ఎంతగానో బాధ పెడుతోంది. అధిక రక్తపోటు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, హార్ట్ స్ట్రోక్ వంటి వ్యాధులు బారిన పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సరైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. స్టెరాయిడ్ టాబ్లెట్ల వాడకం కూడా కొన్ని సందర్భాల్లో అధిక రక్తపోటుకు కారణమవుతుంది.

తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు చేర్చుకోవడం ద్వారా అధిక రక్తపోటు దూరమవుతుంది. ఆహారంతో పాటు ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఆరోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ అయితే తక్కువగా ఉంటుంది. సైకలింగ్, వాకింగ్, స్విమ్మింగ్ చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పవచ్చు.

అధికరక్తపోటు ఉన్నవారు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడి వల్ల మరింత సమస్యలు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆల్కహాల్, కెఫీన్, చెడు కొలెస్ట్రాల్ పదార్థాలు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బయట లభించే సోడా, కూల్‌ డ్రింక్స్‌ను కూడా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది.

అధిక రక్తపోటుతో బాధ పడేవాళ్లు స్వీట్లను సైతం పరిమితంగా తీసుకోవాలి. వైద్యుడు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడటం ద్వారా బీపీని కంట్రోల్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో రక్తపోటు రాకుండా చేసుకోవచ్చు. రక్తపోటు సమస్యతో బాధ పడేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.