ఈ మధ్య కాలంలో చాలామందిని ఇబ్బందులకు గురి చేస్తున్న ఆరోగ్య సమస్యలలో ఆర్థరైటిస్ ఒకటి. ఈ సమస్య బారిన పడిన వాళ్లలో మోకాళ్ల చుట్టూ తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఎన్ని మందులు వాడినా ఈ సమస్య నుంచి ఉపశమనం లభించడం లేదని చాలామంది చెబుతూ ఉంటారు. కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటించడం ద్వారా ఆర్థరైటిస్ సమస్య సులువుగానే దూరమవుతుంది.
ఆర్థరైటిస్ కు ఆయుర్వేదంలో ఉన్న చికిత్సలలో చింత గింజల వైద్యం ఒకటి. టానిన్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి కొన్ని సమ్మేళనాలు పుష్కలంగా ఉండే చింత గింజలు ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి. వైద్యుల సూచనల ప్రకారం చింత గింజల పొడిని నిర్ణీత మోతాదులో ఉపయోగించడం ద్వారా మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. నొప్పి ఉన్న ప్రాంతంలో వేడి కాపడం లేదా కోల్డ్ కాపడం పెట్టడం ద్వారా కూడా సమస్యకు చెక్ పెట్టవచ్చు.
యోగా, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు కీళ్లను దృఢంగా చేయడంలో సహాయపడతాయని చెప్పవచ్చు. ఆర్థరైటిస్ నొప్పి, సమస్య నుండి ఉపశమనం కలిగించడంలో ఫిజియో థెరపీ తోడ్పడుతుంది. శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అల్లోపతి వైద్యంతో ప్రయోజనం పొందలేని వాళ్లు ఆయుర్వేద చికిత్సపై ఆధారపడవచ్చు.
ఆయుర్వేద చికిత్సలో ఫలితాలు ఆలస్యంగా వచ్చినా మళ్లీ మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మోకాళ్ల నొప్పులు మొదలైన సమయంలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలంలో మంచి బెనిఫిట్స్ పొందే అవకాశాలు అయితే ఉంటాయి.