weight Loss: ఏవండోయ్ ఇది విన్నారా.. ఇలా నిద్రపోతే చాలు.. బరువు తగ్గుతారట..!

బరువు తగ్గాలంటే చెమటలు పట్టేలా వ్యాయామం చేయాలి.. కఠినమైన డైట్‌లతో ఆకలితో అలమటించాలి.. ఇవన్నీ పాత పద్ధతులు అంటోంది తాజా రీసెర్చ్. నిపుణుల మాటల ప్రకారం, సరైన సమయానికి భోజనం చేసి, సరైన సమయానికి నిద్రపోతే చాలు.. మన శరీరం నిద్రలోనూ బరువు తగ్గించగలదని వెల్లడైంది. ఈ ప్రక్రియ అంతా మన మెటబాలిజం, హార్మోన్‌లు ఎలా పనిచేస్తున్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది.

ఒక వ్యక్తి రాత్రి భోజనాన్ని సాయంత్రం 6 గంటల లోపు పూర్తిచేస్తే, ఆ తర్వాత కనీసం మూడున్నర నుండి నాలుగు గంటల గ్యాప్ ఇచ్చి 9 గంటలకు నిద్రపోతే, శరీరం ఆ సమయంలో కొవ్వును కాల్చడం ప్రారంభిస్తుందట. ఎందుకంటే, ఆ సమయంలో శరీరం పూర్తి విశ్రాంతిలోకి వెళుతుంది. అలాగే, మెటబాలిజం స్థిరంగా పనిచేసి, ఎనర్జీ బర్న్ అవుతుంది. దీని వల్ల నిద్రలోనే కొవ్వు వినియోగమవుతోంది.

ముఖ్యంగా, గాఢ నిద్రకు చేరినప్పుడు శరీరంలో స్ట్రెస్ హార్మోన్ అయిన ‘కార్టిసోల్’ స్థాయి తగ్గుతుంది. ఈ హార్మోన్ అధికంగా ఉండటం వల్లనే ఎక్కువ మంది ఆకలిని కంట్రోల్ చేయలేకపోతుంటారు. ఈ కార్టిసోల్ తగ్గిపోతే బాడీ ఎనర్జీ వినియోగాన్ని పెంచుతుంది. స్ట్రెస్ తగ్గడం వల్ల overeating తగ్గుతుంది. దీంతో ఆటోమేటిక్‌గా బరువు తగ్గే అవకాశాలు మెరుగవుతాయి.

అంతేకాదు, ఎలాంటి వ్యాయామం లేకుండా, కేవలం నిద్రపోయే టైమ్‌ టేబుల్‌నే కరెక్ట్ చేసుకోవడం ద్వారా మనం అనుకున్నదానికంటే వేగంగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. ఇలా తక్కువ కష్టం, ఎక్కువ ఫలితాల కలిగించే మార్గం మీకు ఎంతో సులువుగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించండి… హెల్దీ బాడీ, హ్యాపీ నిద్ర రెండూ మీ సొంతం కావచ్చు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది దీనిని.. మేము ధృవీకరించడం లేదు.)