మనలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ ను కలిగి ఉండటం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. అయితే కొంతమంది తరచూ ట్రాన్స్ ఫర్ కావడం వల్ల ఆధార్ కార్డ్ లో అడ్రస్ ను తరచూ మార్చుకుంటూ ఉంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఆధార్ కార్డ్ లో అడ్రస్ ను సులువుగా మార్చేయవచ్చు. ఆధార్ లో అడ్రస్ మారని పక్షంలో కొన్ని స్కీమ్స్ బెనిఫిట్స్ పొందడం సాధ్యం కాదు.
అయితే అడ్రస్ ను ఛేంజ్ చేసుకోవాలని భావించే వాళ్లు కచ్చితంగా అడ్రస్ ప్రూఫ్ ను కలిగి ఉండాలి. myaadhaar.uidai.gov.in వెబ్ సైట్ ద్వారా అడ్రస్ ను మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఇచ్చి వన్ టైమ్ పాస్వర్డ్ ను ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ కార్డ్ లో అడ్రస్ మార్చుకోవచ్చు.
ప్రొసీడ్ టూ ఆధార్ అప్ డేట్ ఆప్షన్ ద్వారా ప్రస్తుత ఆధార్ అడ్రస్ వివరాలు కనిపిస్తాయి. రెంటల్ అగ్రిమెంట్ సహాయంతో కూడా ఆధార్ కార్డ్ లో అడ్రస్ మార్చుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ ప్రాసెస్ కు సంబంధించిన ఫీజును ఆన్ లైన్ ద్వారా చెల్లించే ఛాన్స్ అయితే ఉంటుంది.
దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో అడ్రస్ మారే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగా ఆధార్ కార్డ్ లో అడ్రస్ ను సులువుగా మార్చుకోవచ్చు. ఆధార్ కార్డ్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.