బంగారం కొనుగోలు చేస్తున్నారా.. ఈ తేడా తెలియకుండా చేస్తే మాత్రం నష్టపోవాల్సిందే!

ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 80 వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది. అలంకరణ కోసం బంగారంను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. బంగారం విషయంలో ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసుకోకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవనే సంగతి తెలిసిందే.

22 క్యారెట్ల బంగారం 91.6 క్యారెట్ల బంగారం అని చెప్పవచ్చు. 18 క్యారెట్స్ బంగారంలో 75 శాతం స్వచ్చమైన బంగారం మిగిలిన 25 శాతం వెండి, రాగి, క్యాడ్మియం ఉంటాయి. చిన్నచిన్న ఆభరణాల తయారీ కొరకు ఈ బంగారాన్ని వినియోగించడం జరుగుతుంది. బంగారం కొనుగోలు చేసే ముందు క్యారెట్ల గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు.

బంగారం కొనుగోలు చేసే సమయంలో బీ.ఐ.ఎస్ హాల్ మార్క్ ను కచ్చితంగా చెక్ చేసుకోవాలి. హాల్ మార్క్ లేని బంగారం కొనుగోలు చేయడం వల్ల తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 9 క్యారెట్స్ బంగారాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తుండగా 9 క్యారెట్స్ ను ప్రవేశపెడితే తక్కువ ధరకే బంగారం దొరికే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

అయితే తక్కువ క్యారెట్ల బంగారంను కొనుగోలు చేస్తే ఆ బంగారానికి రీసేల్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. బంగారాన్ని కొనుగోలు చేసేవాళ్లు ఈ విషయాలను మరిచిపోతే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.