మనలో చాలామంది చిన్న చిన్నపనులకే అలసిపోతూ ఉంటారు. మారుతున్న ఆహారపు, ఆరోగ్య అలవాట్ల వల్ల చాలామంది అలసిపోతూ ఉంటారనే సంగతి తెలిసిందే. తరచూ అలసిపోతుంటే అది విటమిన్ల లోపానికి సంకేతం అని చెప్పవచ్చు. ప్రోటీన్, విటమిన్లు, వివిధ ఖనిజాలు పుష్కలంగా ఉంటే ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ఏ విటమిన్ లోపం ఉన్నా కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయి.
విటమిన్ ఎ, సి, ఇ మాదిరిగానే విటమిన్ బి-12 కూడా శరీరానికి ఎంతో అవసరమని చెప్పవచ్చు. బీ12 విటమిన్ తీసుకోవడం ద్వారా ఎముకలు, కండరాలను బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది. విటమిన్ బీ12 తీసుకోవడం ద్వారా మెదడు పనితీరు మెరుగుపడటంతో పాటు ఎర్ర రక్త కణాలను పెంపొందించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. విటమిన్ బీ12 లోపం కొత్త ఆరోగ్య సమస్యలను క్రియేట్ చేస్తుంది.
విటమిన్ బీ12 లోపం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు చర్మం రంగు సైతం పాలిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అలసట, మైకం, బలహీనత వంటి లక్షణాలు బీ12 విటమిన్ లోపానికి సంకేతాలు అని చెప్పవచ్చు. బీ విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే ఈ సమస్యలను అధిగమించే ఛాన్స్ అయితే ఉంటుంది.
తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు తరచూ తలెత్తితే కొన్నిసార్లు బీ12 డెఫిషియన్సీ కారణం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. నాలుక వాపు, నోటిలో పొక్కులు వంటి లక్షణాలు తరచూ కనిపిస్తే కూడా బీ విటమిన్ లోపం కారణం అని చెప్పవచ్చు. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు సైతం విటమిన్ బి12 లోపం కారణమవుతుంది. తరచూ సమస్యలు వేధిస్తుంటే బీ12 లోపం ఉందేమో చెక్ చేసుకుంటే మంచిది.