మనలో చాలామంది మజ్జిగ తాగడానికి ఎంతగానో ఇష్టపడతారు. వేసవి కాలంలో మజ్జిగ తాగడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. మజ్జిగలో పోషకాలు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. మజ్జిగ ఎముకలకు, రక్తానికి, కాలేయానికి, జీర్ణక్రియకు, నిద్రకు ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. ముకలు, దంతాలు, రక్తం ఆరోగ్యం మెరుగుపడటంలో మజ్జిగ ఎంతగానో ఉపయోగపడుతుంది.
కాలేయం పనితీరు మెరుగుపరిచే విషయంలో మజ్జిగ తోడ్పడుతుంది. మజ్జిగ ప్రతిరోజూ తాగితే రక్తపోటు మెరుగుపడుతుందని చెప్పవచ్చు. మజ్జిగ తాగడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మజ్జిగను ఎక్కువగా తాగితే ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు మజ్జిగ తాగడం వల్ల ఆ సమస్య దూరమవుతుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో మజ్జిగ ఉపయోగపడుతుంది.
మజ్జిగలో మిరియాల పొడి, ధనియాల పొడి, ఎండబెట్టిన అల్లం పౌడర్ వేసుకుని తాగడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆహారంలో మజ్జిగను తీసుకుంటే కాల్షియంను జోడిస్తుంది. బరువు తగ్గాలని భావించే వాళ్లు మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలి. భోజనానికి ముందు మజ్జిగ తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య దూరమవుతుంది.
మజ్జిగలో కొంచెం ఇంగువా కలుపుకొని తాగడం ద్వారా ఎన్నో లాభాలు కలుగుతాయని చెప్పవచ్చు. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయంలో మజ్జిగ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. మజ్జిగ తాగడం వల్ల శరీరంలో వేడి సైతం సులువుగా తగ్గుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
