మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయా.. ఈ క్రేజీ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టొచ్చట!

ప్రస్తుత కాలంలో చాలామంది ఎలుకల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంటి నుంచి ఎలుకలు పోవడం లేదని చెప్పేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటించడం ద్వారా ఎలుకల సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంటిలో ఎలుకలను నివారించడానికి, స్నాప్ ట్రాప్‌లు, గ్లూ బోర్డులు, కర్పూరం, ఉల్లిపాయలు, మిరియాలు వంటివి ఉపయోగించవచ్చు.

స్నాప్ ట్రాప్‌లను గోడకు ఫ్లష్‌గా అమర్చడం ద్వారా ఎలుకలు ఇంట్లోకి వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. గ్లూ బోర్డులను సరిగ్గా ఉంచడం ద్వార ఇంట్లో ఉన్న ఎలుకలను ఒక్కొక్కటిగా తరిమికొట్టే అవకాశం అయితే ఉంటుంది. ఉల్లిపాయలు, మిరియాలు ఉంచడం ద్వారా వాటి వాసనకు ఎలుకలు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉండదు. ఎలుక ఎర (రోడెంటిసైడ్) ఉపయోగించడం ద్వారా కూడా ఎలుకలను తరిమికొట్టవచ్చు.

గాలి చొరబడని కంటైనర్లలో ఆహారాన్ని నిల్వ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఇల్లు తుడిచే నీటిలో కొన్ని లిక్విడ్స్ ను కలపడం వల్ల ఎలుకలు ఇంట్లో చొరబడే అవకాశాలు ఉండవు. ఉల్లిపాయలు, మిరియాలు వాడటం ద్వారా కూడా ఎలుకలకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. పెద్ద ఎలుకలతో పోల్చి చూస్తే చిన్న ఎలుకలు ఎక్కువగా సమస్యలను క్రియేట్ చేస్తాయి.

ఇంటి మూలల్లో దాక్కొని ఎలుకలు సృష్టించే భీభత్సం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎలుకలను తరిమికొట్టడానికి మందులను వాడటం అంత శ్రేయస్కరం కాదు. శనగపిండి, కారప్పొడి, కర్పూరపు బిళ్లల సహాయంతో కూడా ఎలుకలను తరిమికొట్టడం సులువుగానే సాధ్యమవుతుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా ఎలుకల బెడద నుంచి తప్పించుకోవచ్చు.