Onion: పూజ, ఉపవాస సమయంలో ఉల్లిపాయ ఎందుకు తినకూడదో తెలుసా.. కారణం ఇదే..!

హిందూ సాంప్రదాయాలు అనేక విశిష్టతలను, నిబంధనలను కలిగి ఉంటాయి. ప్రతి పూజా విధానంలో, ప్రతి ఉపవాసంలో ఒక నిబద్ధత ఉంటుంది. శరీరం, మనస్సు, ఆహారపు అలవాట్లతోపాటు, భావోద్వేగాల పరంగా కూడా ఒక పవిత్రత అవసరమని హిందూ ధర్మం చెబుతుంది. అందుకే, పర్వదినాల్లో, ఉపవాసాల్లో కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలను మానుకోవడం ఓ సంప్రదాయంగా మారింది. వాటిలో ఉల్లిపాయ ప్రధానమైనవిగా పరిగణించబడతాయి.

ముఖ్యంగా పూజల సమయంలో ఉల్లిపాయలు వాడరాదు అనే ఆచారం ఎందుకు ఏర్పడిందో చాలా మందికి తెలియదు. ఇది కేవలం ఆరోగ్య కారణమో లేక గుండెను తీవ్రంగా ప్రభావితం చేసే పదార్థమో అనుకోవచ్చు. కానీ దీని వెనుక పురాణ సంబంధిత ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పురాణాల ప్రకారం, దేవతలు మరియు అసురులు సముద్ర మథనం చేసి అమృతాన్ని పొందినప్పుడు, చివరికి ఆ అమృత కలసిన పాత్ర దేవతల చేతుల్లోకి వచ్చింది.

అప్పట్లో విష్ణుమూర్తి మోహినీ రూపంలో అమృతాన్ని దేవతలకే పంచుతుండగా, రాహు అనే అసురుడు దేవతల వేషంలో వచ్చి అమృతాన్ని తాగేశాడు. సూర్యుడు మరియు చంద్రుడు ఇది గమనించగా, విష్ణువు తన సుదర్శన చక్రంతో రాహువు తల నరికేశాడు. అప్పటికే అతను కొంత అమృతాన్ని మింగడంతో, రాహువు శరీరంలోని భాగాలు అమృత ప్రభావంతో అపవిత్ర శక్తులను కలిగి ఉండిపోయాయంట.