తెలంగాణ వాసులకు అలర్ట్.. జీరో కరెంట్ బిల్లు రాని పక్షంలో పాటించాల్సిన చిట్కాలు ఇవే!

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ స్కీమ్స్ లో గృహజ్యోతి స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ ద్వారా కాంగ్రెస్ సర్కార్ 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడిన కుటుంబాలకు జీరో కరెంట్ బిల్లులను మంజూరు చేయిస్తుండటం గమనార్హం. అయితే అర్హత ఉన్నా కొన్ని కుటుంబాలకు మాత్రం జీరో కరెంట్ బిల్లులు రాలేదు.

జీరో కరెంట్ బిల్లులు రాని వాళ్లకు ప్రధానంగా రేషన్ కార్డ్ నంబర్ లో తప్పులు, ఆధార్, విద్యుత్ సర్వీస్ నంబర్లను తప్పుగా మంజూరు చేయడం ద్వారా ఈ సమస్య ఎదురవుతోందని తెలుస్తోంది. చాలామంది గృహజ్యోతి స్కీమ్ లో తమను కూడా చేర్చాలంటూ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతుండటం గమనార్హం. 200 యూనిట్ల లోపు విద్యుత్ ను వాడే వాళ్లు ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందవచ్చు.

అర్హతలు ఉన్నా ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందడంలో ఫెయిల్ అవుతుంటే సమీపంలోని ఎంపీడీవో ఆఫీస్ కు వెళ్లడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వివరాలు తప్పుగా ఇచ్చిన వాళ్లు ఆ తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా బిల్లు కట్టాల్సిన అవసరం అయితే లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం. కొంతమందికి టెక్నికల్ సమస్యల వల్ల కరెంట్ బిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి.

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉండటం గమనార్హం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పథకాల యొక్క ప్రయోజనాలను సులువుగా పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. సమీపంలోని ఎంపీడీవో కార్యాలయాల ద్వారా ఇందుకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.