అగర్ బత్తీ పొగ పీలిస్తే అంత ప్రమాదమా.. అలాంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయా?

మన ఇంట్లో అగర్ బత్తీలను వెలిగించడం సాధారణంగా జరుగుతుంది. అయితే ఈ అగర్ బత్తీల నుంచి వచ్చే పొగ వల్ల మనకు ఎలాంటి లాభం లేకపోగా నష్టం కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వైద్య నిపుణులు అగర్ బత్తీల పొగ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుందని వెల్లడిస్తున్నారు. అధ్యాత్మికంగా అగర్ బత్తీలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నా అగర్‌బత్తీ పొగలో అనేక రకాల అనారోగ్యం కలిగించే మూలకాలు ఉన్నాయి.

ఈ అగర్ బత్తీల తయారీలో వినియోగించే పాలీఅరోమేటిక్‌ హైడ్రో కార్బన్‌ వల్ల శరీరానికి ఊహించని స్థాయిలో నష్టం కలుగుతుంది. అగర్ బత్తీల పొగ పీల్చడం వల్ల జలుబు, దగ్గు, ఎలర్జీ, తుమ్ములు, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. గుండె జబ్బులు, క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులకు సైతం అగర్ బత్తీలు కారణమయ్యే అవకాశం ఉంటుంది.

కార్బన్ డై ఆక్సైడ్‌, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, కార్బన్ మోనాక్సైడ్‌లను పీల్చడం వల్ల ఊపిరితిత్తులలోని కణాలలో వాపు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అగర్ బత్తీలలో ఉండే కెమికల్స్ వల్ల చర్మం, కళ్లు తీవ్ర మైన ఎలర్జీలకు లోనయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పిల్లలను అగర్ బత్తీల పొగకు వీలనంత దూరంగా ఉంచితే మంచిది. ఆధ్యాత్మిక కార్యకలాపాలే వృత్తిగా జీవించే వాళ్లు పొగ పీల్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

క్వాలిటీ అగర్ బత్తీలను వాడటం ద్వారా ఈ ప్రమాదం నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చు. పిల్లలను ఈ పొగకు దూరంగా ఉంచడం మంచిది. ప్రతిరోజూ అగర్ బత్తీల పొగను పీలిస్తే మాత్రం దీర్ఘకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అగర్ బత్తీలను తరచూ వినియోగించే వాళ్లు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి.