ఎయిర్ పోర్ట్స్ అథారిటీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. బీఈ/ బీటెక్ లేదా బీఎస్సీ (ఫిజిక్స్/ మ్యాథ్స్) పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్ రాత పరీక్ష, వాయిస్ టెస్ట్, సైకోయాక్టివ్ సబ్‌స్టాన్స్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని సమాచారం అందుతోంది.
ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులకు మేలు జరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. నవంబర్ నెల 1వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఇతర అభ్యర్థులు మాత్రం 1000 రూపాయల దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు గరిష్టంగా 1,40,000 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.