నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగ ఖాళీలు!

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు విభాగాలలో కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదిక ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండగా జూనియర్ కన్సల్టెంట్స్/అసోసియేట్ కన్సల్టెంట్‌ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

అర్హత, అనుభవం ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 12 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డ్రిల్లింగ్ ఫీల్డ్ ఆపరేషన్స్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగ జనవరి నెల 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు కచ్చితంగా కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. 65 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. kumar_vinod12@ongc.co.in ఈమెయిల్ కు దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 27 వేల రూపాయల నుంచి 42 వేల రూపాయల వరకు వేతనం లభించనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు కన్వేయన్స్ ఖర్చులు, అకామడేషన్ ఖర్చులను సైతం చెల్లించనున్నారని తెలుస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.