ఆర్టీసీలో ఉద్యోగం సాధించడం ఎంతోమంది కల అనే సంగతి తెలిసిందే. ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీలకు పోటీ ఒకింత ఎక్కువగానే ఉంటుంది. ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ, కర్నూలు జోన్లలో వేర్వేరు ట్రేడ్స్ లో అప్రెంటీస్ శిక్షణకు సంబంధించి 606 ఖాళీల భర్తీ దిశగా నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఐటీఐ పాసైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్రెంటీస్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
అర్హత ఉన్న అభ్యర్థులు ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఐటీఐ మార్కులతో పాటు సీనియారిటీ ప్రకారం అప్రెంటీస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభిస్తుందని చెప్పవచ్చు.
పరీక్ష లేకుండా ఆర్టీసీలో 606 నియామకాలు చేపడుతుండటంపై నిరుద్యోగులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త జాబ్ నోటిఫికేషన్ల దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు వీలైనన్ని ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది.
రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుండటం గమనార్హం. రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తుండటం నిరుద్యోగులకు ఎంతగానో మేలు చేస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.