మద్యం తాగే సమయంలో ఈ పదార్థాలను తింటున్నారా.. చాలా ప్రమాదమంటూ?

alcoholHealth-1129338323-770x533-1

దేశంలో చాలామందికి ప్రస్తుతం మద్యం అలవాటు ఉంది. కొంతమంది చిన్న వయస్సులోనే మద్యానికి అలవాటు పడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మద్యం తాగే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే మద్యం తీసుకునే సమయంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు. మద్యం తీసుకునే సమయంలో కొన్ని పదార్థాలు తీసుకుంటే మాత్రం ప్రాణాలకే ప్రమాదం కలుగుతుంది.

 

ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా రోజువారీ ఒత్తిడి సులభంగా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఆల్కహాల్ తీసుకునే సమయంలో కర్రీస్, బీన్స్ సలాడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుందని చెప్పవచ్చు. మద్యం తాగే సమయంలో చాక్లెట్లు కానీ, స్పైసీగా ఉండే ఆహార పదార్థాలను కానీ తీసుకోకూడదు. ఎవరైనా వీటిని తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

 

మద్యం తాగే అలవాటు ఉన్నవాళ్లు మద్యం తాగే సమయంలో నారింజతో తయారు చేసిన సలాడ్స్ కు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. కొంతమంది మద్యం తాగే సమయంలో పిజ్జా తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. అయితే పిజ్జా తినడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదు. మద్యం తాగే సమయంలో పిజ్జాకు వీలైనంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు.

 

మద్యం తాగే సమయంలో కొంతమంది ఫ్రైడ్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు. అయితే మద్యం తాగిన సమయంలో వేయించిన ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టం ఎక్కువని చెప్పవచ్చు. మద్యం తాగే సమయంలో సోడియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు సైతం దూరంగా ఉంటే మంచిది. ఆల్కహాల్ తాగే సమయంలో డెయిరీ ఉత్పత్తులకు సైతం దూరంగా ఉండాలి.