నెలకు 50,000 రూపాయల పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా.. అద్భుతమైన స్కీమ్స్ ఇవే!

దేశంలో రోజురోజుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. మనలో చాలామంది నెలకు 50000 రూపాయల పెన్షన్ పొందాలని అనుకుంటున్నారు. ఎక్కువమొత్తం పెన్షన్ ను పొందాలని భావించే వాళ్లు పెన్షన్ ప్లాన్ ను కొనుగోలు చేయాలి. స్థిరమైన ఆదాయాన్ని అందించే పాలసీలను ఎంచుకోవడం ద్వారా బెనిఫిట్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. నిర్ణీత పెన్షన్ స్కీమ్‌లో తక్కువ వయస్సులో ఇన్వెస్ట్ చేయాలి.

ఎంత తక్కువ వయస్సులో పెట్టుబడి పెట్టడం మొదలుపెడితే అంత ఎక్కువ మొత్తం బెనిఫిట్ పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా కాంపౌండింగ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. సంపాదన మొదలైన రోజు నుంచి ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఊహించని స్థాయిలో లాభాలు సొంతమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకే మొత్తంలో ఎక్కువమొత్తం ఇన్వెస్ట్ చేయకూడదు.

ఒకే స్కీమ్ లో ఎక్కువ మొత్తం పెట్టుబడులుగా పెడితే కొన్నిసార్లు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. నష్ట భయాన్ని తగ్గిస్తూ, రాబడిని పెంచే పోర్ట్‌ఫోలియో దృష్టి పెట్టడం ద్వారా లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. పదవీ విరమణ తర్వాత ఇబ్బందులు రాకుండా సైడ్ బిజినెస్ పై ఫోకస్ పెడితే మంచిది. రాబడి ఎక్కువగా ఉన్న స్కీమ్స్ లో పెట్టుబడి పెంచుకుంటూ వెళ్లాలి.

మ్యూచువల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా మంచి లాభాలను పొందవచ్చు. రిస్క్ ఎక్కువగా ఉండే స్కీమ్స్ లో తక్కువ పెట్టుబడులు పెట్టడమే మంచిది. నిపుణుల సలహాలు తీసుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు.