శృంగారం అంటే చాలా మంది ఒక వయస్సులోనే చెయ్యాలి అన్న అపోహలతో ఉంటారు. కానీ శృంగారం చేయడానికి వయసుపరిమితితో సంబంధం లేదు. వృద్ధాప్యం వచ్చినా శృంగారం పాల్గొనవచ్చు. వయస్సు పైబడ్డ వారైనా కానీ, మీరు మీ భాగస్వామితో శృంగారం గురించి మాట్లాడటం ద్వారా మరియు దాని గురించి మీ భాగస్వామికి ఉన్న అపోహలను దూరం చేయడం ద్వారా అందరూ సంతోషకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు.
చాలా మందికి వారి సెక్స్ లైఫ్ పై చాలా సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా వృద్ధాప్య వయస్సులో చాలా ఎక్కువగా ఉంటాయి. వయస్సుతో పాటుగా మన సెక్స్‌వల్ లైఫ్ పైన కూడా చాలా మార్పులు వస్తాయి. కొంతమంది పురుషులలో శృంగార వాంఛ తగ్గిపోవటం లాంటివి అనుభూతి చెందగా, మహిళల్లో కూడా కొన్ని శరీర మార్పులు మరియు లైంగిక వాంఛలో మార్పులు లాంటివి కూడా చోటుచేసుకుంటాయి. సాధారణంగా వృద్ధులకు లైంగిక జీవితం మరియు వృద్ధాప్యం గురించి ఎక్కువమందికి చాలా సందేహాలుంటాయి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.
సెక్స్‌వల్ లైఫ్ లో వచ్చే మార్పులు…
వృద్ధాప్యంతో, స్త్రీ, పురుషులలో సహజమైన శారీరక మార్పులు రావడం అనేది జరుగుతుంది. అని సెక్స్‌వల్ లైఫ్ పై ప్రభావం చూపుతాయి. డయాబెటిస్ మరియు రక్తపోటు వంటి ఆరోగ్య పరిస్థితులు మన శృంగార వాంఛను మార్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. స్త్రీలలో అయితే మెనోపాజ్ అయిన తరువాత శృంగార వాంఛ తగ్గడం గమనించవచ్చు. దాని వల్ల యోని పొడిబారడం సెక్స్ చేసే సమయంలో నొప్పిని కలిగించవచ్చు. అలాగే హార్మోన్ల చికిత్సలో ఉన్నట్లయితే, మీలో అకస్మాత్తుగా శృంగార వాంఛని పెరుగటాన్ని గమనించవచ్చు. ఇక మగవాళ్ళల్లో అయితే శృంగార వాంఛ తగ్గటం అలాగే అంగస్తంభన సమస్య వస్తుంది.
60 సంవత్సరాలు వచ్చాక శృంగార జీవితాన్ని ఎలా కొనసాగించవచ్చు…
భాగస్వామితో మీ ఆలోచనల గురించి, కోరికల గురించి అలాగే సెక్స్ గురించి మన ఫీలింగ్స్‌ని వారితో పంచుకోవడం. అలాగే శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. తరచు మన శరీరానికి వ్యాయామం అనేది చాలా ఉపయోగకరమైనది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అదే విధంగా తీసుకునే ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పదార్ధాలను తగ్గించి తీసుకోవాలి. మన శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు చాలా ఎదుర్కోవలసి వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ధూమపానం మరియు మద్యపానం మానేయడం లాంటివి అన్నిటికంటే ముఖ్యం. ఇది శృంగార వాంఛ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. క్రొత్తవాటిని ప్రయత్నించడానికి మొహమాట పడొద్దు.