ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ చేస్తున్నారా… ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి!

సాధారణంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధాన్ని మరింత బలోపేతం చేయాలంటే ఇద్దరి మధ్య శృంగారం ఎంతో అవసరం ఇలా శృంగారం ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమను వారి బంధాన్ని పెంచుతుందని చెప్పాలి.అయితే గర్భం దాల్చిన మహిళలు శృంగారంలో పాల్గొనవచ్చా అంటే పాల్గొనవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.అయితే ఒకసారి వైద్యులని సంప్రదించిన తర్వాత వారు ప్రెగ్నెన్సీ విషయంలో ఏ విధమైనటువంటి కాంప్లికేషన్స్ లేవు అని తెలుసుకున్న తరువాతే శృంగారంలో పాల్గొనడం ఎంతో మంచిది.

సాధారణంగా భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్తకు శృంగార కోరికలు కలగడం సర్వసాధారణం అయితే తన ప్రేగ్నెన్సీ ఎలాంటి కండిషన్ లో ఉందని తెలుసుకోవడం కూడా ఎంతో. కొందరికి మావి కిందికి ఉంటుంది అలాంటివారు శృంగారంలో పాల్గొనక పోవడం చాలా మంచిది. అలాగే గతంలో తనకు ఏవైనా అబార్షన్లు కనుక జరిగి ఉంటే ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత శృంగారంలో పాల్గొనకపోవడం ఎంతో మంచిది.ఇక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినటువంటి ఆరు నుంచి 12 వారాల వరకు శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల అబార్షన్స్ అయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి.

ఇక డెలివరీకి నెల ముందు కూడా శృంగారంలో పాల్గొనుకపోవడం మంచిది ఇలా శృంగారంలో పాల్గొనడం వల్ల అధిక ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకే శృంగారంలో పాల్గొనకపోవడం మంచిది ఒకవేళ మీ భార్యకు కనుక శృంగారం కోరికలు కలుగుతాయి కానీ సెక్స్ లో పాల్గొనడం కాదు తనకు మీ నుంచి వెచ్చని కౌగిలిని కోరుకుంటుంది. మీరు తన పట్ల కేర్ తీసుకోవాలని కోరుకుంటుంది కానీ చాలామంది భయం కారణంగా శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపరు. అయితే డాక్టర్ల సలహా మేరకు ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని తెలిస్తే శృంగారంలో పాల్గొనవచ్చు ఇలా శృంగారంలో పాల్గొనడం వల్ల డెలివరీ సమయంలో ఎంతో సులభతరంగా ఉంటుంది.