ఒకే రోజే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనవచ్చా… నిపుణులు ఏం చెబుతున్నారంటే?

ప్రస్తుత కాలంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఈ ఉరుకులు పరుగులు పెడుతున్న కాలంతో పాటు పరుగులు తీస్తూ నిత్యం డబ్బు సంపాదనపై వ్యామోహం చూపుతున్నారు. ఈ క్రమంలోనే వారి సంతోషం సుఖాలను కూడా మర్చిపోతున్నారు. సరైన సమయానికి సరైన తిండి తినడమే లేకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా లేకుండా పోతుంది. ఇలా సంపాదన వ్యామోహంలో భార్యాభర్తలు తమ లైంగిక జీవితాన్ని కూడా ఆస్వాదించలేకపోతున్నారు. ఇలా పని ఒత్తిడి కారణంగా అలసిపోయి లైంగిక జీవితం పై ఆసక్తి చూపలేకపోతున్నారు.

ఇలా చాలామంది దంపతులు వారానికి కనీసం ఒక్కసారి శృంగారంలో పాల్గొనడానికి కూడా ఆసక్తి కనబడలేదు ఇలా వారానికి కనీసం రెండు లేదా మూడుసార్లు అయినా శృంగారంలో పాల్గొంటున్నారు అంటే వారి మధ్య దాంపత్య జీవితం చాలా బాగుందని అర్థం. ఇక శృంగారంలో పాల్గొనడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక పెళ్లయిన తర్వాత చాలామంది సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి వారు సంతానం కోసం రోజుకు రెండు మూడు సార్లు శృంగారంలో పాల్గొంటూ ఉంటారు అయితే ఇలా పాల్గొనడం మంచిదేనా ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారనే విషయానికి వస్తే…

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒకరోజు శృంగారంలో రెండు లేదా మూడుసార్లు పాల్గొన్న ఎలాంటి తప్పు లేదని తెలుపుతున్నారు. అయితే శృంగారంలో పాల్గొనే ముందు స్త్రీల అందోత్పత్తికి అనుగుణంగా శృంగారంలో పాల్గొనడం ఎంతో మంచిది ఇలా పాల్గొన్నప్పుడే తొందరగా సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి.అలా కాకుండా రోజుకు రెండు మూడు సార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల కేవలం మానసిక శారీరక సంతృప్తి తప్ప పిల్లలు కలిగే యోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు.ఇలా ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల వీర్యకణాల వృధా అవుతాయి అలాగే అండోత్పత్తి సమయంలో సరైన స్థాయిలో వీర్యకణాల ఉత్పత్తి లేకపోవడం వల్ల కూడ గర్భ ధారణ జరగదు కనుక ఆండోత్పత్తి సమయంలో ఎక్కువసార్లు శృంగారం మంచిదని నిపుణులు చెబుతున్నారు.